
కొంపన్నాక, కుటుంబం వుంటుంది. కుటుంబం అన్నాక కొన్ని వరసలుంటాయి. ఆ వరసల్లో కూడా రెండు రకాలుంటాయి:పడిచావని వరసలూ, పడి చచ్చే వరసలూ.
అత్తా-కోడలు. వామ్మో! నిప్పూ- గ్యాసూ అన్నట్లు లేదూ? అఫ్కోర్స్! కోడల్ని వదలించుకోవటానిక్కూడా అత్త ఈ వస్తువుల్నే వాడుతుందనుకోండి!
మామా-అల్లుడు. ఇదీ అంతే. అప్పూ- పప్పూ లాంటిది. మామ అప్పు చేస్తే, అల్లుడూ పప్పుకూడు వండిస్తాడు.