పథకాలు కూడా సినిమాల్లా అయిపోయాయి. సినిమాలకు ఉన్నట్టే వీటికీ ఫార్ములాలు వుంటాయి. ఫార్ములాను తప్పి ఎవరన్నా పథకం పెడితే, దాని భవిష్యత్తు చెప్పలేం.
సినిమాలకు స్ప్రిప్టు రైటర్లున్నట్టే, పథక రచయితలు కూడా వుంటారు. అసలు రచయితలు అసలు కనపడనే కనపడరు. కనిపిస్తే జనం దడుచుకుంటారు. అందుకే వారిని ‘ఘోస్ట్’ రైటర్లూ అంటారు. మరీ అనువాదం తప్పదంటే ‘భూత’ రచయితలనుకోవచ్చు