Tag: ప్రత్యేక హోదా

తెలుగు నాట ‘చిన్న’ బోయిన జాతీయ పార్టీలు!

తెలుగు రాష్ట్రాలు వేరయినా, ఒక రాష్ట్రంలోని రాజకీయాల ప్రభావం మరొక చోట పడుతూనే వుంది. నాలుగేళ్ళ తర్వాత ఈ ముద్ర మరింత పెరిగింది. ప్రాంతీయ వైరాలు- నేతల్లో సరేసరి- ప్రజల్లో తగ్గాయి. రాష్ట్రం ‘సమైక్యం’గా వున్నప్పటి అపోహలు ‘వేరు పడ్డాక’ తగ్గాయి. కాపురాలు వేరయ్యాక కలయకలు పెరిగాయి. తెలంగాణ కాస్త ముందుగా ఎన్నికలకు వెళ్ళటంతో ఈ…

‘శ్రీని వాయిస్‌’ ఆఫ్‌ కన్ఫ్యూజన్‌’!

పేరు : చలసాని శ్రీనివాస్‌

దరఖాస్తు చేయు ఉద్యోగం: నాకు ఉద్యోగంతో పనిలేదు. కావలిసింది హోదా… ప్రత్యేక హోదా. అవును ఆంధ్రప్రదేశ్‌కు ఇస్తానన్న ప్రత్యేక హోదా కావాలి. ఆ హోదా ఇచ్చేస్తే, నేను ఇంకో ఉద్యమం చూసుకుంటాను. ఏదో ఒక ఉద్యమం చెయ్యటమే కదా మన ఉద్యోగం!

వయసు : మరీ అంత లేదు. కానీ లేని వయసును నెత్తిన వేసుకుని తిరుగుతుంటాను. అందుకు కారణాలు రెండు. ఒకటి: జాతీయోద్యమం జరుగుతున్న రోజులవి… పాలకొల్లు లో ఖద్దరు ధరించిన వారంతా ఒక చోట గుమిగూడారు… ఇలాంటి ఫ్లాష్‌ బ్యాక్‌లు టీవీ చర్చల్లో చెప్పటం. రెండు: నా వయసు వాళ్ళంతా జీన్స్‌, టీషర్టులు వేసుకుంటుంటే, నేను తెలుపు, నలుపు గెడ్డంతో ‘బ్లాక్‌ అండ్‌ వైట్‌’ సిసిమాల కాలం నాటి డ్రస్సు వేసుకుంటాను.

సీమాంధ్రలో ‘ప్రత్యేక’ ఉద్యమమా?

ఆత్మాహుతి. ఈ మాట తెలుగు నాట రాష్ట్ర విభజనకు ముందు విన్నాం. విడిపోయి ఏడాది దాటాక మళ్ళీ వినాల్సి వస్తోంది. అప్పుడు ఆత్మాహుతులు తెలంగాణలో జరిగాయి. ఇప్పుడు ఆంధ్రలో వినబడింది. విభజనకు ముందు ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి దీటుగా సమైక్యాంధ్ర ఉద్యమం చెయ్యాలని తీవ్రంగా ప్రయత్నించారు. ఉద్వేగాలు ఆంధ్రలో కూడా పతాక స్థాయిలో లేచాయి. తెలంగాణలో ఆ ఉద్వేగం ఆత్మహత్యలూ, ఆత్మాహుతుల వరకూ వెళ్ళి పోయింది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఆ దిశగా పయినించలేదు. కానీ రాష్ట్రం విడిపోయి ఏడాది దాటిపోయిన తర్వాత తెలంగాణ ప్రశాంతంగా వుంది. కానీ ఆంధ్రప్రదేశ్‌ లో కొత్త ఉద్వేగం మొదలయ్యింది. అదే ‘ప్రత్యేక హోదా’కు చెందిన ఉద్యమం.

‘వంక’ల నాయుడు!

దరఖాస్తు చేయు ఉద్యోగం: ‘ప్రత్యేక హోదా’ (నాకు కాదు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి) ఎన్డీయే సర్కారు అధికారంలోకి రానప్పుడు, యూపీయే అధికారంలో వున్నప్పుడు దరఖాస్తు చేశాను. ఇప్పుడు ఎన్డీయే సర్కారు అధికారంలో వుంది. ‘ఇచ్చే హోదా’ లో వున్నాను, కానీ ‘రూల్సు’ అడ్డు వస్తున్నాయి.

వయసు : ‘పెద్ద’ వాణ్ణే. ఎప్పడూ ‘పెద్దల సభ’ నుంచే వచ్చే వాణ్ణి కదా! కానీ అయనా ఏం లాభం? ‘హౌస్‌’ ను ..ఐ మీన్‌ … సభను చక్కదిద్ద లేక పోతున్నాను. పైపెచ్చు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిని కదా!

ముద్దు పేర్లు : ‘వంక’ల నాయుడు ( నేనేం నిజం చెప్పినా ప్రతిపక్షాల వారికి ‘వంక’ చెబుతున్నట్టుంది. ప్రత్యేక హోదా ఇవ్వటానికి ‘ఆర్డినెన్స్‌’ సరికాదు… అందుకు పార్లమెంటు సమ్మతి కావాలంటే వినరే!)