Tag: ప్రమోద్ మహాజన్ హత్య

డయిల్ ‘ఎమ్’(మనీ) ఫర్ మర్డర్!?

పైసలే ప్రాణాలు. ఇది మార్కెట్‌ యుగ ధర్మం. అందుకే రూపాయిని డాలర్‌లోకీ, డాలర్‌ని రూపాయిలోకీ మార్చుకున్నంత సులువుగా, పైసల్ని ప్రాణాల్లోకి, ప్రాణాలను పైసల్లోకి మార్చుకోవచ్చు. ప్రాణాలిచ్చేస్తాను, పైసలిచ్చేయ్‌- అంటూ ప్రాణత్యాగం చేసే వారుంటారు. అందుకే ఎక్స్‌గ్రేషియాకోసమో, రుణ మాఫీ కోసమో మరణించే పేదలూ, రైతులూ చనిపోవటం ఇక్కడ ఆశ్చర్యం కాదు. తాను పోతే, తనతో పాటూ తాను చేసిన అప్పూ పోతుందనో, లేక ఎంతో కొంత ఆర్థిక సాయం సర్కారు తన కుటుంబానికి చేస్తుందనో ఆత్మహత్యలు చేసుకునే వారున్నారు.