
చిన్నవే. ఎప్పుడూ చూసేవే. అనుక్షణం వినేవే. ఎప్పటిప్పుడు తాకేవే. అను నిత్యం ఆఘ్రాణించేవే. రోజూ రుచి చూసేవే. కొత్తగా, కొత్తగా వుంటాయి. పొద్దుపొడుపు ఎండలో ఆకు మీద మెరిసే మంచు బిందువూ, ప్రశాంత సమయంలో పసిబిడ్డ కేరింతా, రాత్రి పూట మెత్తటి గాలి మోసుకొచ్చిన సంపెంగల సువాసనా, కలత నిద్దురలో నుదుటి మీద అమ్మ చేతి స్పర్శా, నాలుక చివర్న ఉప్పూ,కారం కలిసిన పచ్చిమామిడి కాయ ముక్కా- ఎప్పుడయినా పాతబడ్డాయా? మరి బతుకేమిటి? రెడీమేడ్ చొక్కాలా, ఇలా వేసుకుంటే అలా మాసిపోతోంది..!?