ఎక్కడెక్కడికో కదలిపోతుంటాం. పోటెత్తి ప్రవహిస్తూ వుంటాం. సముద్రంలో కలసిపోతుంటాం. సూర్యుడి వెచ్చని కౌగలింతకు ఆవిరయి పోతూ వుంటాం. మేఘాలయి గర్జిస్తుంటాం. కాని పిల్లగాలికే పులకించి పోతుంటాం. నిలువెల్లకరిగి వర్షిస్తుంటాం. ప్రవాహంలో నేనొక బిందువూ. నీవొక బిందువూ. కాస్సేపు వేరు వేరుగా. కాస్సేపు సమూహంగా. మధ్యలో వచ్చి పోయే చావు పుట్టుకలు కమర్షియల్ బ్రేకులు.