జగన్ ప్రణబ్‌కు వోటేశారు.
కాంగ్రెస్‌తో ‘మ్యాచ్ ఫిక్సింగా’? వెంటనే అనుమానం.
ఇంకేముంది? యుపీయే అభ్యర్థి, కాంగ్రెస్‌లో కీలకమయిన వ్యక్తి ప్రణబ్ ముఖర్జీకి వోటెయ్యటమంటే కాంగ్రెస్‌లో కలవటం కాదూ?
నిజంగానే ఇది ‘మ్యాచ్ ఫిక్సింగ్’ల సీజన్. సంకీర్ణ రాజకీయ యుగంలో- ఇది సహజం.
కానీ, జగన్ ‘మ్యాచ్ ఫిక్సింగ్’ అంటూ వెంటనే చేసుకోవలసి వస్తే, కాంగ్రెస్ తో చేసుకోరు. ఒక వేళ అలా చేసుకుని కలిసిపోతే, అది తన పార్టీ(వైయస్సార్ కాంగ్రెస్‌పార్టీ)కి మంచిది కాదు, కాంగ్రెస్ పార్టీకీ మంచిది కాదు. నిన్న కత్తులు దూసుకున్న వారు నేడు కౌగలించుకుంటే, అంతే వేగంగా రెండు పార్టీల్లోని కార్యకర్తలూ చెయ్యలేరు.