‘నమస్కారం సార్! తమరంత పలికిమాలిన వారు మరొకరు వుండరట కదా!’ ఇలా సంభాషణ ఎవరయినా మొదలు పెడతరా?
‘పెద్దలు, సంస్కార వంతులు, విజ్ఞులూ అయిన మీరు..’ అని మొదలు పెట్టి , ‘ఇంత నీచ, నీకృష్టమైన స్థితికి దిగజారతారా?’ అంటూ ఏ వక్తయినా ముగిస్తారా?
‘నీ కాళ్లు కడిగి నెత్తి మీద వేసుకుంటా; నీకు జీవితాంతం ఊడిగం చేస్తా; చచ్చి నీ కడుపున పుడతా.’ అని ప్రాధేయపడి, వెంటనే ‘ ఈ రాష్ట్రాన్ని దోచుకోవటం ఆపవయ్యా!’ అని ఏ బాధితుడయినా మొరపెట్టుకుంటాడా?