పేరు :రజనీ కాంత్
దరఖాస్తు చేయు ఉద్యోగం: స్టారాధిస్టారుడు.
ముద్దు పేర్లు : వాజీ. శివాజీ. శివాజీరావు గైక్వాడ్ ( అసలు పేరు ఇప్పటికీ ముద్దుగానే వుంటుంది.)
విద్యార్హతలు : బీ.ఎస్.సి . అంటే తెలుసా? (బ్యాచిలర్ ఆఫ్ స్వింగింగ్ సిగార్) చేతిలో సిగార్ను(సిగరెట్టును) విసిరితే అది రెండు పల్టీలు కొట్టి నోట్లో పడుతుంది.(నాలా చాలా మంది ప్రయత్నం చేసి మూతులు కాల్చుకున్నారు.బ్రహ్మానందం లాంటి ‘పొట్టి రాయుడు’ పక్కవాళ్ళ మూతుల్ని కాలుస్తారు.)