ఒకప్పుడు గ్లామరే రాజకీయం. నేడు వ్యూహమే సర్వస్వమయిపోయింది. కేవలం వ్యూహమే వుండి, జనాకర్షణ లేకపోయినా దిగులు లేదు. తర్వాత అదే జనాకర్షణగా మారుతుంది. ఉత్త జనాకర్షణ వుండి వ్యూహం లేక పోతే.. ఆ మెరుపు ఎన్నాళ్ళో నిలవదు. జాతీయ రాజకీయాల్లో రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీల విషయంలో అదే జరిగింది. రాహుల్ గాంధీకి జనాకర్షణ అన్నది…
Tag: రాహుల్ గాంధీ
మీటింగ్స్ తోనే రాహుల్కు రేటింగ్సా..?
రాహుల్ గాంధీ రేంజ్ హఠాత్తుగా మారిపోయిందా? ఆయన రేటింగ్స్ ఠపీ మని పెరిగిపోయాయా? యువరాజుకి పార్టీలో రాజయోగం పట్టేసినట్లేనా? అధ్యక్షుడికి ముందు వున్న ‘ఉప’ విశేషణం తొలిగిపోయినట్లేనా? చూడబోతే, ఇలాంటి వింత ఏదో దేశ రాజకీయాల్లో జరిగేటట్లుగానే వుంది. ఆటలో ఎప్పుడోకానీ గెలవని వాడిని, గెలిపించాలంటే రెండే రెండు మార్గాలు. ఒకటి: ఆట నేర్పించటం రెండు:…
కేలెండరే కాదు, కేరక్టర్లూ మారాయి!
అంతా ముందే. తర్వాత ఏమీ వుండదు. పెళ్ళికి ముందే, బాజాలయినా, భజంతీలయినా. పెళ్ళయ్యాక ఏమి మిగులుతాయి? ఎంగిలి విస్తళ్ళు తప్ప. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కూడా పెళ్ళిళ్ళు లాంటివే. ఎన్నికలకు ముందే హడావిడి. అయ్యాక ఏమీ వుండదు.
కేలండర్ దాటితే( 2013 పోయి 2014 వస్తే) రెండు మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలే. అప్పుడు ఏమి మిగులుతాయి? వెలిసిపోయిన పోస్టర్లూ, హోర్డింగులూ మినహా. హడావిడి అంతా, ఎన్నికలకు ముందు సంవత్సరమే. అందుకే 2013 అంతా చప్పుడుతో గడిచింది.
‘ఖద్దరు’ సేన కిది రాహుల్ నామ సంవత్సరమయితే, ‘కాషాయ’ దళానికి మోడీ నామ సంవత్సరం. ప్రధాని అభ్యర్థులు ఖరారయ్యారు. రాహుల్కు కాంగ్రెస్ పార్టీలో పోటీ ఎవ్వరూ లేరు.(ఉన్నా రారు కూడా.) కానీ, బీజేపీలో మాత్రం మోడీకి పోటీ వచ్చారు. సాక్షాత్తూ, గురువూ, కురువృధ్ధుడూ అద్వానీయే పోటీకి వచ్చారు
నాది ‘సేమ్ డైలాగ్’ కాదు!
రాహుల్ మోడీ!
నరేంద్ర గాంధీ!
అనుమానం లేదు. మీరు సరిగానే చదివారు. ఇద్దరూ ప్రధాన అభ్యర్థులే. కానీ రూపాలు మారలేదు. కానీ గొంతులే మారాయి.
రాహుల్ గాంధీకి నరేంద్ర మోడీ, నరేంద్రమోడీకి రాహుల్ గాంధీ వచ్చి డబ్బింగ్ చెప్పినట్లుంది. ఒకరి మాటలు ఒకరు మాట్లాడేస్తున్నారు. వారి సభలకు వచ్చిన వారూ, వాటిని టీవీల ముందు కూర్చుని వింటున్న వారూ, కాస్సేపు తమని తాము గిల్లి చూసుకుంటున్నారు.
కలయా?నిజమా? వైష్ణవ మాయా?
అఫ్ కోర్స్. కలయే. ఎన్ని ‘కల’యే.