
ఊపిరి లాంటిదే ఊహ కూడా.
ఊపిరితో బతికేది ఒక్క బతుకే. కానీ ఊహతో వెయ్యిన్కొక్క బతుకులు బతకొచ్చు.
‘ఓ అందాల రాకుమారుడు గుర్రమెక్కాడు.’ అని కథ మొదలు కాగానే, పాఠకుడు రాకుమారుడయి పోతాడు. కొండలు, వాగులు దాటుతుంటాడు.
‘ ఓడ మునగటంతో ఓ కుర్రవాడు వచ్చి లైఫ్ బోట్లో పడతాడు’ అనగానే ఆ విపత్తు పాఠకుడికి వచ్చి పడుతుంది.