
పేరు : నారా లోకేష్ బాబు
దరఖాస్తు చేయు ఉద్యోగం: ‘సన్ రైజర్స్’ టీమ్ కెప్టెన్.( క్రికెట్ గురించి కాదు, నేను పాలిటిక్స్ గురించే మాట్లాడుతున్నాను. ‘సన్ రైజర్స్’ అంటే ‘పొడుచు కొస్తున్న సూర్యులు’ కాదు, ‘తోసుకొస్తున్న కొడుకులు’. కావాలంటే ఈ టీమ్‌లో ‘కేటీఆర్’ కూడా చేరవచ్చు.)
వయసు :’ఎగిరే’ వయసే! అంటే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ‘ఎగురుతున్నా’నని అపార్థం చేసుకునేరు…! అంటే ‘ఫ్లయ్’ చేసే ఈడొచ్చిందని. కాబట్టే… దేశదేశాల్లో ఫ్లయ్ చేస్తున్నాను.