వేరే గ్రహం నుంచి భూమ్మీదకు దిగి, వెతుక్కుంటూ, వెతుక్కుంటూ భారత దేశం వచ్చిన ‘పీకే'(అమీర్ ఖాన్), ఈ దేశంలో తప్ప ఎక్కడయినా వుంటానంటున్నాడా? ఆ సినిమాలో అన్ని మత ఛాందసాలకూ, సమానంగా తలంటు పోసిన అమీర్ పట్ల, ఒక మతానికి చెందిన ఛాందసులే ‘అసహనం’ ప్రదర్శించారా? ఇంతకీ దేశం వెళ్ళాలనే ఆలోచన ఆయనకు వచ్చిందా? లేక హిందువుగానే పుట్టిన తన భార్య(కిరణ్)కు వచ్చిందా?
Tag: వరంగల్ ఉప ఎన్నిక
వీధిలో ‘రాజయ్య’- ఇంట్లో ‘మామయ్య’
పేరు : సిరిసిల్ల రాజయ్య
దరఖాస్తు చేయు ఉద్యోగం: నష్ట జాతకుడు ( వరంగల్ పార్లమెంటు సీటు ఉప ఎన్నికకు కాంగ్రెస్ తరపున నామినేషన్ వేసి కూడా ఉపసంహరణకు ముందే పోటీలోనుంచి తప్పుకోవాల్సి వచ్చిన అభ్యర్థిని ఏమంటారు?)
వయసు : షష్టి పూర్తి చేసుకుని రెండేళ్ళ అయ్యింది. అయితే మాత్రం ఇప్పుడే కాలేజీలో చేరిన కుర్రవాడి స్పిరిట్ మనకుంటుంది. ( అందుకే కదా, న్యూ యియర్ పార్టీలో ‘కాలేజీ పోరగాల్ల లెక్క చిందులేసిన’. మనస్టెప్పులు చూస్తే పడి పోవాల్సిందే. అఫ్ కోర్స్ రాజకీయాల్లో నేను వేసిన రాంగ్ స్టెప్స్‌కు నేనే పడిపోయాను. అది వేరే విషయం.)