‘డాడీ! డాడీ! మమ్మీ కాల్తోంది!’
‘ఎక్కడుంది?’
‘కిచెన్లో!’
కంగారు పడాల్సిన పనేలేదు. ‘తెంగ్లీషు’ కదా అలాగే వుంటుంది. ‘మమ్మీ పిలుస్తోంది’ అని కూడా చెప్పవచ్చు. కానీ మామూలుగా పిలవట్లేదు. ‘మొబైల్లో’ పిలుస్తోంది. దాన్ని పిలుపు అంటే బాగుండదనీ, ‘కాల్’ అనే అనాలనీ మొబైల్ కంపెనీ వాళ్ళే తేల్చేశారు- టీవీ ప్రకటనల సాక్షిగా.