Tag: వైయస్సార్ కాంగ్రెస్

బాబు ‘గ్రహ’ స్థితి మారిందా?

ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు గ్రహం? ఎవరు ఉపగ్రహం? బీజేపీ, తెలుగుదేశం పార్టీల విషయంలో పరిశీలకులకు కలుగుతున్న సందేహమిది. రెంటి మధ్యా ‘వియ్యమూ’ కొత్త కాదూ, ‘విడాకులూ’ కొత్త కాదు. ఇంతకు ముందు కూడా బీజేపీతో తెలుగుదేశం పార్టీ కలిసి ‘కాపురం’ చేసింది. తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీరామారావు బీజేపీని పూర్తిగా దూరం పెట్టినా, ఆ తర్వాత పార్టీ పగ్గాలు అందుకున్న చంద్రబాబు నాయుడు మాత్రం బీజేపీతో ‘దాగుడు మూతలు’ ఆడుతూనే వున్నారు. ఆయనకి ఈ పార్టీ ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విధంగా కనిపిస్తుంది.

తెరచుకోనున్న ‘ఫ్రంట్‌’ డోర్‌!

రెండు రాష్ట్రాలుగా విడిపోనున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ముగిసిపోయిన వెంటనే, అసలు రాజకీయాలు మొదలయ్యాయి. ఇవి రెండు స్రవంతుల్లో నడుస్తున్నాయి. ఒకటి: రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఎలా, ఎవరు ఏర్పాటు చెయ్యాలి? రెండు: రెండు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలకు వచ్చిన పార్లమెంటు సీట్లను కేంద్రంలో ఎవరికి ఇవ్వాలి? ఎన్డీయేకా? కాంగ్రెస్‌కా? ఇంకా గర్భస్త శిశువుగానే వున్న మూడో ఫ్రంట్‌ కా?

‘ఈజీ’ నామాలా? ‘క్రేజీ’నామాలా?

రోజూ పెట్టే ‘నామా’లే, రాజీనామాలయ్యాయి. ఎవరు ఎవరికి పెడతారు? అనుమానమేముంది? నేతలు జనానికి పెడతారు.మట్లాడితే రాజీనామా! అంటే మన నేతల్లో పదవీవ్యామోహ స్థాయి అంత దారుణంగా పడిపోయిందా? కుర్చీలన్నా, అధికారాలన్నా లెక్కలేకుండా పోయిందా? ఎమ్మెల్యే, ఎంపీలే కాకుండా, మంత్రులు కూడా రాజీనామాలకు దూకేస్తున్నారు. ఇంత నిస్వార్థపరత్వం వీరికెలా వచ్చేసింది? చూసే వాళ్ళకి నిజంగానే ఆశ్చర్యంగా వుంటుంది.

వన్-టూ-టెన్ జగనే..జగను

నెంబర్ వన్ జగన్‌, టూ జగన్‌, త్రీజగన్‌… టెన్‌కూడా జగనే. వైయస్సార్‌ కాంగ్రెస్‌లో నాయకత్వ పరిస్థితి అది. ఒకప్పుడు రాష్ట్ర కాంగ్రెస్‌లో వైయస్‌ రాజశేఖర రెడ్డి కూడా అలాగే వున్నారు. వోటర్లను సమ్మోహితుల్ని చెయ్యటానికి పార్టీలో అగ్రతార అలాగే కనిపించాలి. ఇదే ఆకర్షణ. కానీ, పార్టీనిర్మాణానికి ఇది అడ్డంకి అవుతుంది. ప్రతీ పనికీ కార్యకర్తలు అగ్రనేత ఆదేశాల కోసం ఎదురు చూస్తుంటారు. ప్రతి చిన్న విషయంలోనూ అగ్రనేత తల దూర్చాల్సి వుంటుంది. ఈ పనే ఇప్పుడు జగన్‌ చేస్తున్నారు. జగన్‌ ఆస్తుల కేసులో సిబిఐ జగన్‌ను అరెస్టు చేసి, జైలు పాలు చేస్తే, ఆయన తర్వాత ఆ పాత్రని ఏ నేతలు పోషిస్తారు? రాజకీయాల్లో సంక్షోభం కూడా అవకాశమే. దీనిని ఉపయోగించుకోవటానికి జగన్‌ తర్వాత ఎవరు సిద్ధంగా వున్నారు?