
చెప్పుల్లో కాళ్ళు పెట్టటమూ, తప్పుల్లో వేళ్ళు పెట్టటమూ చిన్న విషయాలు కావు. అయినా సరే, చిన్న పిల్లలకు ఈ రెండు పనులూ సరదా. చెయ్యకుండా వుండలేరు. నాన్న చెప్పుల్లోనో, నానమ్మ చెప్పుల్లోనో కాళ్ళు పెట్టటానికి ఉబలాటపడతారు. పెద్దచెప్పులూ, బుల్లి పాదాలూ..! ఇదో ఆట. ఈ ఆటే వారసత్వ రాజకీయం. మిగిలిన దేశాల మాట ఎలా వున్నా, మన దేశంలో ఈ ఆటకు డిమాండ్ ఎక్కువ.