సతీష్ చందర్ ఎలా మాట్లాడతారో, ఆలా రాస్తారనీ, ఆయన చతురోక్తుల్లో విజ్ఞానం దాగి వుంటుందని, తెలంగాణ రిసోర్స్ సెంటర్ ఛైర్మన్ ఎం. వేదకుమార్ అన్నారు. సతీష్ చందర్ రచించిన వ్యంగ్య గ్రంథం ‘కింగ్‌మేకర్’ ను ఆయన 29 అక్టోబర్ 2013 న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం మినీ హాల్ లో ఆవిష్కరించారు. సతీష్ చందర్ తో తనకున్న రెండు దశాబ్దాల స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన ఏ పత్రికలో సంపాదకుడిగా పనిచేసినా, ఆ పత్రికను కొత్త పంథాలో నడిపించారన్నారు. ప్రత్యేకించి అట్టడుగు వర్గాల వేదనను ఆయన పలికిస్తారన్నారు.