నీళ్ళల్లో పాలులాగా, కొబ్బరి నీళ్ళల్లో జిన్నులాగా, తేనెలో నిమ్మరసంలాగా…ద్రవమన్నాక.. ఇంకో ద్రవంలో కలిసిపోవాలి. లేకుంటే ఉపద్రవంలోనన్నా కలిసిపోవాలి. విస్కీలో సోడా
కలిసిపోవటంలేదూ..! వెనకటికో రచయిత కాస్త ‘రస సిధ్ధి’ పొందాక, విస్కీని ద్రవంతోనూ, సోడాను ఉపద్రవంతోనూ పోల్చాడు.( బుస బుసమని పొంగటంతో ఉపద్రవమని భావించి వుంటాడు.
జీవితాన్ని ‘స్కాచి’ వడపోసిన వాడికి ఉపమానాలు కొరవా? ) ‘సారా’ంశం ఏమిటంటే ద్రవంలో ద్రవం కలిసి తీరాలి.
ఈ సిధ్ధాంతమే ద్రవ్యానికీ(డబ్బుకీ) వర్తిస్తుంది. ద్రవ్యం ద్రవ్యంలో కలిసిపోవాలి.