Tag: సామూహిక అత్యాచారం

బుల్లి పెట్టె లో ‘బూతో’డు!

‘టెర్రరిస్టు ఎలా పుడతాడు?’

‘దేశం మీద మరో దేశం పడినప్పుడు’

‘ఎక్స్ట్రీమిస్టు ఎలా పుడతాడు?

‘వర్గం మీద మరో వర్గం పడినప్పుడు’

‘రేపిస్టు ఎలా పుడతాడు?’

‘… ….. ….. ……!’

అవును. ఈ ప్రశ్నకు సమాధానం లేదు.

మానవేతరులు

నిజమే. తీయాలనే వుంది. ఉరి తీయాలనే వుంది. దేహాలను దురాక్రమంచే కిరాతకాన్ని ఉరితీయాలనే వుంది. అమ్మదగ్గర తాగిన పాలు అమ్మాయిదగ్గర కొచ్చేసరికి విషం గా మారిపోతున్నాయి. ఇందుకు కారణమైన ‘అజీర్ణ‘ క్రిమిని పట్టుకుని పీక నులిమేయాలని వుంది. కానీ ఈ క్రిముల పెంపకాన్ని పరిశ్రమగా పెట్టారని తెలిసింది. వారెవ్వరూ తేలేవరకూ ఉరి ప్రశ్నార్థకంగా వేలాడుతూనే వుండాలా? అందాకా ఈ క్రిమిసోకిన వాడి రోగలక్షణాలని జనానికి చెబుదాం. ఈ రోగలక్షణాలున్న మానవేతరులను మచ్చుకి కొందరిని పరిచయం చేస్తాను.

పురుషాధిక్యానంద బాబా(పు.బా)

పేరు : పురుషాధిక్యానంద బాబా(పుబా. తిరగేస్తే ‘బాపు’ కావచ్చు. నాకనవసరం కానీ నేను పు.బానే)

దరఖాస్తు చేయు ఉద్యోగం: రక్తిదాత, ముక్తిదాత, విరక్తి దాత.

ముద్దు పేర్లు :ఏ పేరుతో పిలిచినా పలుకుతాను. మీరు ‘పోబే’ అన్నా నాకు ‘బాబా-అన్నట్లే వినపడుతుంది. ఒక్కో చోట ఒక్కో రూపంలో అవతరిస్తుంటాను. హంసతూలిక తూలికా తల్పంమీద వున్న అనునిత్యానందుణ్నీ నేనే. మనసారా మధువును గ్రోలినప్పుడు ‘పెగ్గు’బాబానీ నేనే, పట్టపగలు నా ఆశీస్సులకోసం వచ్చిన యువభక్తురాళ్ళకు వెచ్చని కౌగిలి నిచ్చే ‘హగ్గు’ బాబానీ నేనే