స్వామి తలచుకుంటే కేసులకు కరువా? ‘కలహభోజనుడు’ సుబ్రహ్మణ్య స్వామి అంటేనే వివాదం. ఆయన ఏ పార్టీలో వున్నా ‘వన్ మ్యాన్ ఆర్మీ’ (ఏక సభ్య సైన్యం) లాగా వుంటారు. కూపీలూ లాగటంలోనూ, లొసుగులు వెతకటంలోనూ దిట్ట. అయితే అన్ని కూపీలూ నిలబడవు. కొన్ని వీగిపోతుంటాయి. ఆయన ఎవరి మీదయినా గురిపెట్టారంటే, ఇక వారి చుట్టూనే తిరుగుతుంటారు. రాజకీయంగా ఆయనకు కాంగ్రెస్ మీద ఎప్పుడూ ఒక కన్ను వేసే వుంచుతారు. ఈ మధ్య కాలంలో ఆయన కారణంగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ రెండు సార్లు వివాదాల్లో చిక్కుకున్నారు.
Tag: సోనియా గాంధీ
కాంగ్రెస్ ‘మానియా’!
పేరు : సోనియా గాంధీ
దరఖాస్తు చేయు ఉద్యోగం: ఉత్తమ మాతృమూర్తి (పిల్లల్ని ప్రయోజకుల్ని చేసిన తల్లిని ఈ దేశంలో ఇలా పిలుస్తారని తెలుసుకున్నాను. ఎంత సమయం పట్టినా సరే రాహుల్ గాంధీని ప్రయోజకుణ్ణి చేసి తీరతాను.)
వయసు : భారత స్వాతంత్య్రానికున్న వయసు కన్నా, నా వయసు తొమ్మిది నెలలు ఎక్కువ. అంతే.
ముద్దు పేర్లు : సో ‘నియంత’! ( నేను పార్టీలో ఎంత ప్రజాస్వామికంగా వున్నా- నియంత లా వున్నావు, నియంత లా వున్నావు- అని అంటే నాకు విసుకొచ్చి ‘సో.. నియంత నే!.. అయితే ఏమిటి?’ అని అనాలని కూడా అనిపిస్తుంది. కానీ నేను నిజంగానే ప్రజాస్వామ్యవాదిని కదా, అందుకనే అలా అనలేదు.),
వాళ్ళు చేతులతో నడుస్తారు!
వలసలే భయం -ఉప ఎన్నికలు నయం
ఎన్నికలంటే ఏమిటి?
హామీలూ, వరాలూ, తిట్లూ, శాపనార్థాలూ – ఇవి కదా!
కానీ, కేసులూ, ఖాతాల స్తంభనలూ, ఆస్తుల జప్తులూ, అరెస్టులూ… ఇవేమిటి?
ఎన్నికలప్పుడు- పలు అధికారాలు ప్రభుత్వం నుంచి ఎన్నికల కమిషన్(ఇసి) కొచ్చేస్తాయి. అందుచేత ఈ వేళల్లో ఆ సంస్థే తీర్పరిగా వుంటుంది. కానీ ఇప్పుటి (18 అసెంబ్లీ స్థానాల) ఉప ఎన్నికలు చూడండి. హడావిడి ‘ఇసి’ కాదు. అంతా ‘సిబిఐ’ దే.