మాట ఎవరికయినా ఇవ్వొచ్చు. అదేమన్నా మనసా? ఎప్పుడు కావాలంటే అప్పుడు వెనక్కి తీసుకోవచ్చు.
కావాలంటే మనసు కూడా ఇచ్చి వెనక్కి తీసుకోవచ్చు కానీ, అదెలావుంటుందంటే, పర్సు ఇచ్చి వెనక్కి తీసుకున్నట్టు వుంటుంది. మన పర్సు మనకి వచ్చేస్తుంది. కానీ మన పైసలు మనకి రావు. మనసు అంతే, మన మనసు మనకి వచ్చేస్తుంది. అందులో ప్రేమ వుండదు. ఆ తర్వాత అది మనకు కూడా పనికి రాదు.
మాట అలా కాదు. తీసేస్కోవచ్చు. పాలిటిష్యన్ల చూడండి. నోటూ ఇస్తారు. మాటా ఇస్తారు. అయిదేళ్ళకోసారి వెయ్యిరూపాయిల నోటు ఇస్తారు. మళ్ళీ వెనక్కి తీసుకుంటారా? లేదే! కానీ మాటో..? వెంటనే వెనక్కి తీసేసుకుంటారు.