Tag: Amit Shah bio-data

‘గో’మిత్‌ షా!

పేరు : అమిత్‌ భాయ్‌ అనిల్‌ చంద్ర షా (చిన్నబుచ్చితే) అమిత్‌ షా

దరఖాస్తు చేయు ఉద్యోగం: ‘కవ్‌’ బాయ్‌ ( ఏం? సినిమాల్లోనే గానే రాజకీయాల్లో ‘కవ్‌ బాయ్స్‌’ వుండకూడదా? ‘గోవు’ పవిత్రమైన జంతువు అని కుర్రాళ్ళంతా ‘కవ్‌ బాయ్స్‌’ కారా?

వయసు : మేం బీజేపీలో ‘బాయ్స్‌’ మే. నేను యాభయిలలో వున్నా, మోడీ అరవయిలలో వున్నా మేం ‘బాలురం’ కిందే లెక్కే, ఎందుకంటే, అద్వానీజీ, మురళీ మనోహర్‌ జోషీజీలు ఎనభయిలల్లో వుంటూ ‘యవ్వనుల్లా’గా కుర్చీలకు పోటీ పడుతున్నారు కదా!

ముద్దు పేర్లు :’గో’మిత్‌ షా( గోవు అంటే ఆవు. మిత్‌ అంటే కల్పన. రెండూ చేసింది నేనే. బీహార్‌ ప్రజలు గోవును పవిత్రంగానే స్వీకరించారు. బీజేపీ అంటే గోవు, గోవు అంటే బీజేపీ అని నమ్మారు. తదనుగుణంగానే మాకు తీర్పు ఇచ్చారు. 243 సీట్లకీ 58 సీట్లే ఇచ్చారు. ‘గంగి గోవు పాలు గరిటడయినను చాలు’ అంటారు. )