ఒక చారిత్రక సన్నివేశం. ఓ ఉద్విగ్న సందర్భం కూడా. సీమాంధ్ర ప్రజల సుధీర్ఘ స్వప్నానికి ఓ దృశ్యరూపం గా అమరావతిలో చట్ట సభలు కొలువు తీరాయి. ఒక రాజధాని వెంట ఒక ప్రజాసమూహం దశాబ్దాలు తరబడి వెంటపడటం అరుదయిన పరిణామం. అది సీమాంధ్ర ప్రజలకే చెల్లింది. ఒక రాష్ట్రం కోసం వెంపర్లాడటం వేరు. ఒక రాజధానికోసం…
Tag: AP Assembly
దొందూ దొందే!
అటు చంద్రుడు; ఇటు చంద్రుడు. ఇద్దరూ ఇద్దరే.
పేరులోనే కాదు, తీరులో కూడా ఇద్దరికీ పోలికలు వున్నాయి:
పూర్వ విద్యార్ధులు: చంద్రబాబే కాదు, కేసీఆర్ కూడా ఎన్టీఆర్ ట్రస్టులో చదువుకున్న వారే. ఎదురు తిరిగిన వారిని, ఎలా ‘కూర్చో’ బెట్టాలో తెలిసిన వారు. కొందరికి పదవులిచ్చి ‘కుర్చీలు’ వేస్తారు; ఎందరికో పదవులు ఇస్తామని ఆశ చూపి ‘గోడ కుర్చీ’లు వేస్తారు. దాంతో తమకి వ్యతిరేకుల్లో ఎవరూ’లేవరు’.