
పేరు : ఆసారం బాపు (అసలు పేరు అసుమల్ సిరుమలానీ)
ముద్దు పేర్లు : ‘అత్యాచారం’ బాపు (ఇది ఆరోపణే. అయినా అలా పిలుస్తున్నారు.), ‘అనాచారం’ బాపు(ఆచారాలను రూపు మాపుతున్నా, నా మీద ఇలాంటి అభాండాలు వేస్తున్నారు.)
విద్యార్హతలు : ధ్యానం( భూమి మీద. అందుకే ఆశ్రమాలకు భూమిని సేకరించగలిగాను.దేశంలోనూ, దేశం వెలుపలా దాదాపు 400 వరకూ ఆశ్రమాలున్నాయి.) పరధ్యానం(అందుకే భక్తురాళ్ళ మీద చేతులు వేసేటప్పుడు మైనరో, మేజరో చూసుకోను.)