ఏ పార్టీకయినా హఠాత్తుగా ‘అంటరానివారు’ గుర్తొచ్చారంటే, ఆ పార్టీని వోటర్లు ‘వెలి’ వేశారని అర్థం చేసుకోవాలి. అలాగే ‘వెనుబడిన వారు’ గుర్తొచ్చారంటే ఆ పార్టీ వోట్లవేటలో ‘వెనుకబడిందీ’ అని అర్థం. ఆ లెక్కన చూసుకుంటే, పార్టీలన్నీ అయితే ‘అంటరాని’వో లేక, ‘వెనుకబడినవో’ అయినట్లే.
Tag: Asom
సోనియా కోపం- రాహుల్ కోసం!
సోనియా గాంధీ ‘బొగ్గు’ మన్నారు. పార్లమెంటు ‘మసి’బారింది. సమావేశాల్లో మరో రోజు ‘బ్లాక్’ డేగా మారింది. ఏమిటో అంతా ‘నలుపే’. బొగ్గు గనుల కేటాయిపుల అవకతకలపై ‘కాగ్’ నివేదిక చూశాక కాగి పోవాల్సింది ప్రతి పక్షం. కానీ, అదేమిటో పాలక పక్షం ఊగిపోతోంది. బీజేపీకి ‘బ్లాక్ మెయిలింగే బువ్వ’ అన్నారు సోనియా. బీజేపీ నేతలకు – ‘బ్లాక్’ మెయిలింగ్ లో ‘బ్లాక్’ ఒక్కటే అర్థమయింది. నలుపుకు నలుపే సమాధానం అనుకున్నారో ఏమో సమాధానం కూడా ‘నలుపు’తోనే ఇచ్చారు.