Tag: Dalit Chriistian Life

ముల్లు

పేరు విక్టర్‌. కానీ పరాజితుడు. రోజీవాళ్ళ పేటే అతడిది కూడా. పదోతరగతి తప్పి పేటలో వుండిపోయాడు. ఆ తర్వాత మూడేళ్ళకు బయిటపడి, హాస్టల్‌ తర్వాత హాస్టల్‌ మారుతూ యూనివర్శిటీ హాస్టల్లో సెటిలయ్యాడు. డిగ్రీ తర్వాత డిగ్రీ చేసుకుంటూ,  ఉచిత భోజన, వసతులను కష్టపడి సాధించి,  గ్రూప్‌ వన్‌ నుంచి కానిస్టేబుల్‌ వరకూ నిర్వహించే సమస్త పోటీ పరీక్షలకూ కూర్చునేవాడు. అలా అతడికి నలభయ్యేళ్ళు నిండిపోయాయి.