ప్రేక్షకుడికి కనపడని వాడూ, వినపడని వాడూ దర్శకుడు. ఈ నిర్వచనం దాసరి నారాయణరావు వచ్చేంత వరకే. తర్వాత మారిపోయింది. దర్శకుడు క.వి( కనిపించి వినిపించేవాడు) అయిపోయాడు. దర్శకుడిగా వుంటూ కూడా ఎక్కడో అక్కడ చిన్న పాత్రలోనయినా ఆయన తళుక్కున మెరిసేవారు. సినిమా అయ్యాక కూడా చిన్న ‘లెక్చరిచ్చి’ కానీ, వదలే వారు కారు. నాయకానాయికలు కలసిపోయి,…
Tag: Dasari Narayana rao
దాసరి నారాయణరావుతో రిపోర్టర్ పమ్ము
ధాసరినారాయణ రావు మాజీ కేంద్ర బొగ్గుగనుల సహాయ మంత్రి. అంతే కాదు ఆయన ఉదయం దినపత్రిక, బొబ్బిలి పులి వార పత్రికల వ్యవస్థాపకులు. సరే ఎలాగూ ఆయన జగమెరిగన చిత్ర దర్శకులే. అలాంటి వ్యక్తి కూడా బొగ్గుగనుల ముడుపుల కేసులో ఇరుక్కున్నారు. ఈ సందర్భంగా తెలుగు పాఠకులకు సుపరిచితమైన కార్టూన్ కేరక్టర్ రిపోర్టర్ పమ్ము ఇంటర్వ్యూ చేస్తే ఎలావుంటుంది? ఒకే ఒక్క నిమిషంలో చదవచ్చు.
‘కాపు’దలలో కాంగ్రెస్ వుంటుందా?
కులం ఉందంటే ఉంది; లేదంటే లేదు. కాలేజీ ‘ఫ్రెండ్షిప్పు’ల్లో ఒక్కొక్క సారి కులం నిపించదు. కానీ ప్రేమలూ, పెళ్ళిళ్ళూ వచ్చేసరికి- కులం ఎలా వచ్చేస్తుందో వచ్చేస్తుంది. అదేమి విచిత్రమో కానీ, తాను ‘ప్రేమించిన అమ్మాయిది తన కులమే- అని తేలుతుంది'( తనకులానికి చెందిన అమ్మాయి మీదనే తనకు మనసు మళ్ళింది- అని చెబితే అసహ్యంగా వుండదూ! అందుకని ఇలా అనుకోవటంలో ఓ తృప్తి వుంది)