కొన్ని సమాజాల్లో, కొన్ని కాలాల్లో బహు భార్యత్వాలూ, బహు భర్తృత్వాలూ వున్నట్లు, మన ప్రజాస్వామ్యంలో బహుళ పార్టీ విధానం వుంది. ఎన్ని పార్టీలయినా పెట్టుకోవచ్చు. దాంతో, ‘ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల’లా రాజకీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. ఇంకా పుడుతూనే వున్నాయి. ఇంకా పుడతాయి కూడా. అయితే మన అదృష్టం బాగుండి, అన్నీ పూర్ణాయుష్షుతో వుండవు.
కొన్ని పుట్టగానే మరణిస్తాయి. చిత్రం! కొన్ని పుట్టకుండా మరణిస్తాయి.