
ప్రతీ పువ్వూ పుట్టగానే పరిమళించడం వంటి వెర్రివేషాలు వెయ్యదు. పుట్టు కవులు, పుట్టు కళాకారులు ఉండరు. కాకుంటే అలాంటి లక్షణమేదో చిన్నప్పటి చేష్టల్ని బట్టి పెరుగుతూ ఉంటుంది. అది ముదిరి ఏదో ఒక రోజున కళయి బైట పడుతుంది. దేవదాసు కనకాల ఒక నటుడు. కర్ణుడు కవచకుండలాలతో పుట్టినట్టు ఇతనేమీ మేకప్పు, విగ్గూ వగైరాలతో పుట్టలేదు.…