బధ్ధకించవచ్చు, మరచి పోవచ్చు-
దగ్గర బంధువుల ఇంట్లో పెళ్ళికి వెళ్ళక పోవచ్చు. ఎడమ కాలి చీలమండ కింద ఎయిర్ ఫ్రాక్చర్ అయిందనో, కుడి వైపున జ్ఞానదంతం నొప్పిపెట్టి దంత వైద్యుడి దగ్గర కువెళ్ళితే, అతడి అజ్ఞానం కొద్దీ దాని పక్క పన్ను పీకినంత పనిచేశాడనో చెప్పవచ్చు.( చెప్పే కథల్లో డీటైల్స్ ఎక్కువ వుంటే తొందరగా నమ్ముతారు లెండి.)
కానీ ఎవరయినా తన పెళ్ళికి తాను హాజరు కావటం బధ్ధకిస్తే , పోనీ మరచి పోతే ఏమవుతుంది?