(ఇంట్రో…
పదిహేనేళ్ళ క్రితం నాటి మాట. నేను అప్పుడు వార్త దినపత్రికకు అసోసియేట్ ఎడిటర్ వున్నాను. సిల్క్ స్మిత చనిపోయిందన్న వార్త న్యూస్ ఏజెన్సీల ద్వారా మాకు చేరింది. ఆమె చనిపోవటం కన్నా, చనిపోయిన తీరు నన్ను బాధించింది. ఆ రోజు ఆమె మీదనే సంపాదకీయం రాయాలని నిర్ణయించుకున్నాను. రాసేశాను. ఇంకా అది పేజీల్లోకి వెళ్ళకుండానే, ఎలా తెలిసిందో మార్కెటింగ్ విభాగం వారికి తెలిసిపోయింది. అప్పటి జనరల్ మేనేజర్ అయితే కంగారు పడ్డాడు. ‘ఆమె ఏమన్నా మహానటి సావిత్రా? వ్యాంప్ (రోల్స్ వేసుకునే ఆమె) మీద సంపాదకీయమా? పరువు పోతుంది.’ అన్నాడు. నేను వినలేదు.