కుక్కల్ని మనుషులు ఎప్పుడో కానీ కరవవు. పురుషుల మీద అత్యాచారాలు ఎప్పుడో కానీ జరగవు. బాబాలు ఎప్పుడో కానీ భక్తుల కాళ్ళ మీద పడరు.
కానీ, ఆసక్తికరమైన వార్తలు. వార్తలు రాసేవాళ్ళకు ఈ రహస్యం తెలియకపోయినా ఫర్వాలేదు కానీ, వార్తల్లోకి ఎక్కాలనుకునే వాళ్ళకు మాత్రం ఈ విషయం అర్థం కావాలి.
ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ జస్టిస్ మర్కండేయ్ కట్జూ వార్తల్లోకి ఎక్కాలనే నిర్ణయించుకున్నారు. ఆయన మాట్లాడితే వార్తయి పోతోంది.