
మన దరిద్రమేమిటో కానీ, దరిద్రాన్ని ఒకేలా చూస్తాం. సినిమా వాళ్ళూ అలాగే చూపిస్తారు. నలభయ్యేళ్ళ క్రితం బిచ్చగాడెలా వున్నాడో, ఇప్పుడూ అలాగే వుంటాడు. అలాగే అడుక్కు తింటాడు. చూసి,చూసి ప్రేక్షకుడికే కాదు, తీసితీసి దర్శకుడికి కూడా చికాకు వస్తుంది. దాంతో ‘కడుపు మాడే బిచ్చగాడు’ కాస్తా, ‘తినమరిగిన బిచ్చగాడి’ గా కనిపిస్తాడు, అప్పుడు వాడి చేత…