Tag: hand

‘గుర్తు’కొస్తున్నాయీ…!

కేజ్రీవాల్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీకి గుర్తు ‘చీపురు’ ఇచ్చారు కాబట్టి సరిపోయింది కానీ, ఏ ‘చిప్పో’ యిస్తే ఏమయ్యేది? ఏమీ అయ్యేది కాదు. ‘చీపురు’ కాబట్టి, అవినీతిని తుడిచిపాడేశాడు- అని అనేశారు. ‘చిప్ప’ కు తగ్గ గొప్ప చిప్పకూ వుంటుంది. దేశంలో నేతలు సంపదను మేసేసి, సామాన్యులకు ‘చిప్ప’ ఇస్తారా?- అని తిరగబడేవాడు.

ఎన్నికల సంఘం ఏ ‘గుర్తు’ ఇచ్చినా, తమ నినాదానికి అనుగుణం మార్చుకునే తెలివి పార్టీ నేతలకు వుంటుంది. అయితే అదృష్ట వశాత్తూ, కొన్ని పార్టీలకు బాగా నప్పే గుర్తులు వస్తుంటాయి.