
తలుపు తెరిచే వుంది. ఏం లాభం? అడ్డుగా కర్టెన్. పేరుకే పారదర్శకత. కానీ అంతా గోప్యం. ఇదీ మన ప్రజాస్వామ్యం. అన్నీ వ్యవస్థల్నీ అనలేం కానీ, కొన్నింటిలో అయితే మామూలు తెరలు కావు, ఇనుప తెరలు వుంటాయి. అలాంటివే రక్షణ, న్యాయ వ్యవస్థలు. అవి సామాన్యమైన వ్యవస్థలా? ఒకటి దేశాన్ని కాపాడేదీ; మరొకటి వ్యక్తిని కాపాడేది.…