కొందరికి జీవిత చరిత్ర అంటూ వేరే ఏదీ వుండదు. ఎందుకంటే వారికి జీవితమే చరిత్ర కాబట్టి. కరుణానిధి ఆకోవలోకి వస్తారు. ఆధునిక తమిళనాడు చరిత్రకూ ఆయన జీవిత చరిత్రకూ తేడా ఏమీ లేదు. ఏడున్నరదశాబ్దాల తమిళుల చరిత్రను ఎలా తిప్పి, ఎలా రాసినా అది ఆయన చరిత్రే అవుతుంది. అవును తాను రాసిందే చరిత్ర, తాను…
Tag: karunanidhi
’కాషాయం‘ వదలిన చోటే, వాజ్ పేయీ హీరో!
కరుణానిధి కన్నుమూసిన కొన్ని రోజులకే వాజ్పేయీ తుదిశ్వాస విడిచారు. ఇద్దరి మధ్యా పోలికలే కాదు.., పోలికల్లో వ్యత్యాసాలూ,వ్యత్యాసాల్లో పోలికలూ వున్నాయి. ఇద్దరూ తొమ్మిది పదులు దాటి జీవించారు. ఇద్దరూ మంచి వక్తలే. కాకుంటే కరుణ తమిళలంలో దంచేస్తే, వాజ్ పేయీ హిందీలో ఊపేస్తారు. ‘ఏ రాష్ట్రమేగినా’ ఒకరు తమిళం తప్ప హిందీని ముట్టరొకరు. ‘ ఏ…
‘కుటుంబ’ నిధి!
పేరు : కరుణా నిధి
ముద్దు పేర్లు : కుటుంబ నిధి.( నాకుటుంబానికి నిధి లాంటి వాడిని).రణ నిధి. విరమణ నిధి. రుణ నిధి. దారుణ నిధి
విద్యార్హతలు : కళలో పుట్టాను. రాజకీయాల్లో పెరిగాను.
హోదాలు : అప్పుడప్పుడూ జయలలిత ఇచ్చే ‘కమర్షియల్ బ్రేకు’లు మినహా ఎప్పుడూ తమిళనాడు ముఖ్యమంత్రినే. ఇప్పుడు ‘కమర్షియల్ బ్రేకు’ నడుస్తోంది కాబట్టి నన్ను ‘మాజీ’ అంటున్నారు. అంతే.