
ప్రకృతిని ఎన్నయినా అనవచ్చు. ప్రకృతి కన్నెర్ర చేసింది. ప్రకృతి ప్రకోపించింది. ప్రకృతి విలయతాండవం చేసింది. వరదలొచ్చినా, ఉప్పెనలొచ్చినా, సునామీలొచ్చినా, కడకు భూకంపాలొచ్చినా- ప్రకృతిని తిడుతూనే వుంటాం. పాపం! ప్రకృతి తన పై వచ్చిన ఆరోపణలను ఖండించలేదు. పత్రికా ప్రకటన విడుదల చేయలేదు. పరువు నష్టం దావా వేయలేదు. మౌనంగా అన్ని ఆరోపణలూ భరిస్తుంది.