ఏ కాంగ్రెస్ ను వోడిస్తానని తొడలు చరిచారో, అదే కాంగ్రెస్కు ద్రోహం జరుతోందని కుమిలి పోయారు. రెండు పాత్రలూ ఒకే హీరో పోషించారు. మామూలు హీరో కాదు. ‘మెగా’ హీరో చిరంజీవి. తొడలు చరిచినప్పుడు ‘ప్రజారాజ్యం’ వ్యవస్థాపకుడు. కుమిలి పోయినప్పుడు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు. కొందరు ‘ఇక్కడి(కాంగ్రెస్) తిండి తిని, అక్కడి( వైయస్సార్ కాంగ్రెస్) పాట పాడుతున్నానన్నారు. ఇదే సామెతను ఆయనకు అనువుగా పేరడీ చేయవచ్చు. ‘అక్కడి( ప్రజారాజ్యం) వోటుతో గెలిచి, ఇక్కడి(కాంగ్రెస్) సీటులో కూర్చున్నారు’ అని.
Tag: KVP Ramachandra Rao
‘కుప్పిగంతుల’ హనుమంతరావు
పేరు వి.హనుమంత రావు
దరఖాస్తు చేయు ఉద్యోగం: ‘వీర భక్త హనుమాన్’. అవును నా పేరు మాత్రమే కాదు, నా ఉద్యోగం పేరు కూడా. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం దగ్గర ఇలాంటి ఉద్యోగాలు వుంటాయి. పూర్వం డి.కె. బరూవా అనే ఒకాయన వుండే వారు. ఆయన ఈ ఉద్యోగమే చేశారు. కాబట్టే ‘ఇందిర అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిర’ నినాదం ఇవ్వగలిగారు. ఇప్పుడు నేను ‘ఇందిర’ బదులు ‘సోనియా’ అంటాను. అంతే తేడా.
‘ఆత్మ’ రాముడు నటిస్తాడా?
నేడు స్నేహ దినోత్సవం.స్నేహానికి నిర్వచనం చెప్పాల్సి వచ్చినప్పుడెల్లా సినిమా రంగం నుంచి ‘బాపు-రమణ’లను ఉదహరించేవారు. కానీ వైయస్ తొలిసారిగా ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మరో ఉదాహరణ రాజకీయ రంగంనుంచి దొరికేసింది. ‘వైయస్-కె.వి.పి’లను ఆ రీతిలో కీర్తించటం మొదలు పెట్టారు.( వారికి ఇలాంటి స్నేహం దశాబ్దాల నుంచీ వుండవచ్చు. కానీ ఆ విషయం లోకానికి కాస్త అలస్యంగా తేటతెల్లమయింది.) ముఖ్యమంత్రి అయ్యాక ఆయనతో ఎప్పుడూ రెండు పాత్రలు కనిపిస్తుండేవి. ఒకటి ‘ఆత్మ’, రెండు ‘నీడ’. ఆత్మ- కె.వి.పి రామ చంద్ర రావు అయితే, నీడ-సూరీడు. కానీ పాపం. వైయస్ చివరిసారిగా హెలికాప్టర్ ఎక్కినప్పుడు మాత్రమే ‘ఆత్మ’నీ, ‘నీడ’నీ వదలేశారు.