Tag: leader

లీడర్‌ రూటే వేరు!

లీడరా? అంటే ఎవరు?

సమాధానం తెలిసినట్టుగానే వుంటుంది కానీ, తెలియనట్టుగా కూడా వుంటుంది. కొన్ని అంతే. ప్రేమికుడా? అంటే? అప్పుడు ఇలాగే చెబుతాం.

కానీ కొందరు మహానుభావులు వుంటారు. మరీ నిర్వచనాలు ఇవ్వరు కానీ, చిన్న చిన్న క్లూలు ఇచ్చి వెళ్ళిపోతారు. గురజాడ అప్పారావు ఇదే పనిచేశారు.

లీడర్‌ గురించి చెప్పలేదు కానీ, పాలిటిష్యన్‌ గురించి చెప్పారు. నిజానికి చెప్పారూ అనటం కన్నా, చెప్పించారూ అనటం సబబు గా వుంటుంది.

‘ఒపీనియన్స్‌ చేంజ్‌ చేస్తేనే కానీ పాలిటిష్యన్‌ కాలేడు’ అని ఓ తుంటరి పాత్ర చేత అనిపిస్తాడు

మాట వున్నది, తప్పటానికే!!

రాజకీయాలను చూసి, విసిగి, వేసారి తల మాసిపోయిన ఓ ప్రసిధ్ద నాయకుడికి, ఓ రోజు నిజంగానే ప్రజాస్వామ్యం దర్శనం ఇచ్చింది. దానికి ‘మూడు ముఖాలు’ వున్నాయి. (‘సింహాల ముఖాలు కాదండోయ్‌). వాటినే ‘మూడు అంచెలు కాబోలు’ అని అనుకున్నాడు. ఇంతకీ ఆ మూడూ ఏమిటనుకున్నారు? మూడు ‘మ’లు. (ఇంగ్లీషులో అయితే మూడు ‘ఎమ్‌’లు): మనీ, మాఫియా, మీడియా.