తలుపు వెయ్యటం సులువే, తీయటమే కష్టం. విమానం టేకాఫ్ కావటం తేలికే; లాండ్ కావటమే ఇబ్బంది. పద్మవ్యూహంలోకి వెళ్ళటం సులభమే, రావటమే దుర్లభం- తెలివి వుంటే తప్ప. ఇంటికి కాదు, ఏకంగా దేశానికే తాళం వేసిపారేశారు. ఒక తాళం అయితే సరిపోదని ఎక్కడికక్కడ రాష్ట్రాలు ఎగబడి తాళం మీద తాళం ఎగబడి మరీ వేసేశారు. కారణం…