రెండు రాష్ట్రాలుగా విడిపోనున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ముగిసిపోయిన వెంటనే, అసలు రాజకీయాలు మొదలయ్యాయి. ఇవి రెండు స్రవంతుల్లో నడుస్తున్నాయి. ఒకటి: రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఎలా, ఎవరు ఏర్పాటు చెయ్యాలి? రెండు: రెండు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలకు వచ్చిన పార్లమెంటు సీట్లను కేంద్రంలో ఎవరికి ఇవ్వాలి? ఎన్డీయేకా? కాంగ్రెస్‌కా? ఇంకా గర్భస్త శిశువుగానే వున్న మూడో ఫ్రంట్ కా?