క్రికెట్లోనే క్రీడాకారులు’మ్యాచ్ ఫిక్సింగ్’ల నుంచి ‘స్పాట్ ఫిక్సింగ్’ల వరకూ వచ్చేశారు. రాజకీయ ఆటగాళ్ళు రాకుండా వుంటారా? వాళ్ళ కన్నా ముందే వచ్చేసి వుంటారు.
మన రాష్ట్రమే తీసుకోండి. ప్రతీ పార్టీ- మరో రెండు పార్టీల మధ్య ‘మ్యాచ్ ఫిక్సింగ్’ జరిగిపోయందని ఆరోపిస్తుంది. ఈ ‘మ్యాచ్ ఫిక్సింగ్’ కాంగ్రెస్-వైయస్సార్ కాంగ్రెస్‌ల మధ్య జరిగిపోయిందని తెలుగుదేశం ఆడిపోసుకుంటే; కాంగ్రెస్- తెలుగుదేశం పార్టీ ల మధ్య జరిగిపోయిందని వైయస్సార్ కాంగ్రెస్ ఎత్తి పొడుస్తుంటుంది.