రాజకీయాలను చూసి, విసిగి, వేసారి తల మాసిపోయిన ఓ ప్రసిధ్ద నాయకుడికి, ఓ రోజు నిజంగానే ప్రజాస్వామ్యం దర్శనం ఇచ్చింది. దానికి ‘మూడు ముఖాలు’ వున్నాయి. (‘సింహాల ముఖాలు కాదండోయ్). వాటినే ‘మూడు అంచెలు కాబోలు’ అని అనుకున్నాడు. ఇంతకీ ఆ మూడూ ఏమిటనుకున్నారు? మూడు ‘మ’లు. (ఇంగ్లీషులో అయితే మూడు ‘ఎమ్’లు): మనీ, మాఫియా, మీడియా.