మూడు ప్రేమలు. మూడు పరువులు. మూడు దాడులు. మూడూ తెలంగాణ రాష్ట్రంలోనే. మూడూ దేశవ్యాపిత సంచలనాలే. చిత్రం. మూడు చోట్లా ప్రియుళ్ళు దళితులు. ప్రియురాళ్ళు ‘ఇతర’ కులస్తులు. అన్ని కథలకూ ముగింపు ఒక్కటే: నెత్తురు కళ్ళ చూడటం. తొలిఘటన జరిగి ఏడాది గడిచిపోయింది. మిగిలిన రెండు ఘటనలూ గత వారం రోజుల్లో జరిగాయి. మూడు స్థలాలు…