రెండు తెలుగు రాష్ట్రాలలలో పెద్దల సభలు యుధ్ధానికి సిధ్ధమవుతున్నాయి. ఈ యుధ్ధం ఆంధ్రప్రదేశ్లో అంతర్గతం; తెలంగాణలో బహిర్గతం. ఆంధ్రప్రదేశ్లో నిజంగానే తెలుగుదేశం పార్టీలో కుమ్ములాటలాగ మొదలయింది. తెలంగాణలో అలా కాదు, ఇది పార్టీల మధ్య పోరులాగా మారింది. కానీ రెండు చోట్లా అధికారపక్షాలకు ‘పెద్దలు’ అన్నమాటకు నిర్వచనాలు మార్చుకున్నారు.
Tag: MLC Polls
ఏనుగు లేదా? ఎలుకయినా, ఓకే!
ప్రేయసిని కోల్పోతే..? దేవదాసు అవుతాడు.
పదవిని కోల్పోతే..?! ఖాళీగ్లాసు అవుతాడు.
అతనికీ, ఇతనికీ ఒక్కటే తేడా. ఒకడికి గ్లాసు ఫుల్లుంటుంది. ఇంకొకడికి గ్లాసు నిల్లుంటుంది.
ద్రవాన్ని బట్టి గ్లాసుకు విలువ కానీ, గ్లాసును బట్టి ద్రవానికి కాదు.
పదవి పోయినా పాలిటిష్యనూ, పదవి వున్న నేతా చూడ్డానికి ఒకేలా కనిపిస్తారు.
అది గంజిపట్టించి ఇస్త్రీ చేయించిన ఖద్దరు చొక్కా, అదే రేబన్ కళ్ళజోడూ, అదే క్వాలిస్ బండీ, అదే సఫారీ వేసుకున్న ఉబ్బిన బుగ్గలూ, బండ మీసాలూ వున్న మనుషులు.