విపత్తు!
జనానికి శాపం. నేతలకు వరం.
నేతల్లో ఆపక్షమూ, ఈ పక్షమూ అని కాదు, ఏ పక్ష నేతలకయినా సదవకాశమే.
ఒక గుడిసె అంటూ వుంటే, గుడిసెలో ఓ విద్యుత్తు బల్బనో, అందులో గ్యాస్ పొయ్యనో, వంటనూననో- ఇలాంటి కోరికలు జనానికి పుడతాయి.
అదే వరదొచ్చి గుడిసే పోయిందనుకోండి. దానితో పాటు మంచం, కంచం, బర్రే, గొర్రే, పగ్గం, మగ్గం- కూడా అన్నీ కొట్టుకు పోయాయనుకోండి.. అడగటానికి ఏముంటుంది?
కడుపు నింపుకోవటానికి ఓ ఆహార పొట్లాం. కప్పుకోవటానికి ఓ పాత దుప్పటీ.
ఇవి పంచిన వాడు దేవుడు.