నిద్రపోతేనే కదా…కల వచ్చేదీ! మళ్ళీ ఆకలలో నిద్రపోతే…!?ఒక్కొక్కప్పుడు అలాగే జరుగుతుంది. ఇలలో చేసిన అన్ని పనులూ, కలలో కూడా చేస్తాం కదా! ఎవరినో కౌగలించుకున్నట్లూ, ముద్దు పెట్టినట్లూ , సుఖం పొందినట్లూ మాత్రమే కాదు…పరుగెత్తినట్లూ, అలసి పోయినట్లూ, నిద్రపోయినట్లూ కలవస్తుంది.మొద్దు నిద్ర. నిద్రలోని నిద్ర. కలలోని నిద్ర. మెలకువ వస్తే బాగుణ్ణు. గింజుకుంటున్నాడు. కళ్ళు తెరవలేక…