Tag: Nirbhaya Rape

కారులో రేప్‌ చేస్తే, కొలిచి మరీ కోప్పడతారా?

కోపం.రావచ్చు; తెచ్చుకోవచ్చు.తెచ్చుకునే కోపాల్లో ఎక్కువ తక్కువలు వుండవచ్చు. ఎంత తెచ్చుకోవాలో అంతే తెచ్చుకునే స్థితప్రజ్ఞులు వుంటారు. అన్ని రంగాల్లోనూ కనిపిస్తారు. రాజకీయ నేతల్లో అయితే మరీను.కానీ, వచ్చే కోపం అలా కాదే. అది తన్నుకుని వచ్చేస్తుంది. దానికెవరూ ఆనకట్ట కాదు కదా, కనీసం బరాజ్‌ కూడా నిర్మించలేరు. సాదా సీదా మనుషులకు వచ్చేవి ఇలాంటి కోపాలే…