Tag: NTR

‘కాలా’కు కౌంటర్… ‘అల(కుల) వైకుంఠపురం లో’!?

రాను రాను రావణుడికి గిరాకీ పెరుగుతోంది. రాజకీయాల్లోనే కాదు, సినిమాల్లో కూడా. ఇలా ఈ పాత్రను చూడగా చూడగా, ప్రేక్షకులకు ఒక సందేహం వచ్చి తీరుతుంది. ఇంతకీ రావణుడు నాయకుడా? ప్రతినాయకుడా? (హీరోనా? విలనా?) రామాయణం విన్న వారికీ, చదివిన వారికీ అతడు ‘సీతమ్మ వారిని ఎత్తుకు పోయిన పది తలల రాక్షసుడు’. అయితే ఇంకాస్త…

ముంచుకొస్తున్న ‘భయమే’ ముందస్తుకు కారణం!

అయిదేళ్ళ సభను ముందే రద్దు చేసి, మరో అయిదేళ్ళ అధికారాన్ని కోరుతున్నారు కేసీఆర్‌. అయినా ఈ ఎన్నికలను ‘ముందస్తు’ అనకూడదు. అంటే ఆయనకు కోపం వస్తుంది. ఎంత ముందయితే ‘ముందస్తు’ అనవచ్చో మరి? ఇంకా ఎనిమిది నెలలు (అయిదురోజులు తక్కువ లెండి) పదవీ కాలం వుందనగా ఎన్నికలకు వెళ్తున్నారు. అంటే, కేవలం ముందుగా కాదు, బాగా…

సన్నాఫ్‌ ‘చంద్ర’ మూర్తి!

పేరు : నారా లోకేష్‌ బాబు

దరఖాస్తు చేయు ఉద్యోగం: ‘సన్‌ రైజర్స్‌’ టీమ్‌ కెప్టెన్‌.( క్రికెట్‌ గురించి కాదు, నేను పాలిటిక్స్‌ గురించే మాట్లాడుతున్నాను. ‘సన్‌ రైజర్స్‌’ అంటే ‘పొడుచు కొస్తున్న సూర్యులు’ కాదు, ‘తోసుకొస్తున్న కొడుకులు’. కావాలంటే ఈ టీమ్‌లో ‘కేటీఆర్‌’ కూడా చేరవచ్చు.)

వయసు :’ఎగిరే’ వయసే! అంటే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ‘ఎగురుతున్నా’నని అపార్థం చేసుకునేరు…! అంటే ‘ఫ్లయ్‌’ చేసే ఈడొచ్చిందని. కాబట్టే… దేశదేశాల్లో ఫ్లయ్‌ చేస్తున్నాను.

‘దేశ‘మును ప్రేమించుమన్నా.. పొత్తు అన్నది ఉంచుమన్నా.!

మోడీకి నిజంగానే దేశం భక్తి తన్ను కొచ్చింది. ఇది ఒక రకం కాదు, రెండు రకాలు. ఒకటి: ‘హిందూ’ దేశభక్తి.(భారత దేశం అనే మాట కంటే, హిందూదేశమనే మటే ఆయనకు ఎంతో వినసొంపుగా వుంటుంది.) రెండవది: ‘తెలుగుదేశ’భక్తి. ఈ రెంటినీ ఏకకాలంలో ఆయన హైదరాబాద్‌లో ప్రకటించాడు.

సి ఫర్‌ ‘కాపు’ చంద్రయ్య!

పేరు : సి(చెన్నంశెట్టి). రామచంద్రయ్య

ముద్దు పేరు : సి ఫర్‌ ‘కాపు’ చంద్రయ్య.(కాపులను బీసీలో చేర్చాలని కోరుతున్నాను.)

విద్యార్హతలు : లెక్కల్లో మనిషిని.(ఒకప్పుడు చార్టర్డ్‌ అకౌంటెంట్‌ను లెండి.) ఇప్పుడు కూడా లెక్కలు తప్పటం లేదు. కాపులు+బీసీలు= కాంగ్రెస్‌ అని అంటున్నాను. (సీమాంధ్రలో రెడ్లూ, దళితులూ వైయస్సార్‌ కాంగ్రెస్‌లోకి జారుకుంటున్నారు కదా! అందుకే రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి చిరునామా మిగలాలంటే నా ‘లెక్క’ను పాటించాల్సిందే. (కాపుల్ని కూడా బీసీల్లో కలిపేస్తే మొత్తం బీసీలయిపోతారు.)

మన కౌగిళ్ళలో మహానటులు!!

నటించటమంటే మరేమీ కాదు, నమ్మించెయ్యటమే.

తానే కృష్డుణ్ణని నమ్మించేశారు ఎన్టీఆర్‌ ఆరోజుల్లో. ఎంతటి ఎన్టీఆర్‌కయినా మిత్రులూ, అభిమానులతో పాటు శత్రువులు కూడా వుంటారు కదా! వాళ్ళల్లో భక్తులు కూడా వుండే వుంటారు. వారికష్టం ఎంతటిదో ఊహించుకోండి. కళ్ళు మూసుకుని కృష్ణుణ్ణి ఊహించుకుంటే ఎన్టీఆర్‌ వచ్చేస్తుంటాడు. మరి ఎన్టీఆరే కళ్ళు మూసుకుని కృష్ణుణ్ణి తలచుకుంటే, ఆయనకు ఏ రూపం కనపడేదో..?! ఆది ఆయన గొడవ. వదిలేద్దాం.

కడుపులు నింపేదే రాజకీయం!

ఒక్క ముక్కలో చెప్పాలి.

రెండో మాట వినే స్థితి లేదెవ్వరికీ. అది సినిమా కావచ్చు. రాజకీయం కావచ్చు.

తెలంగాణ వెళ్ళితే ఒక్కటే ముక్క: ప్రత్యేక రాష్ట్రం.

సీమాంధ్ర వెళ్ళితే కూడా ఒక్కటే ముక్క: ఓదార్పు.

దేహానికి ఎన్నిరోగాలున్నా ఔషధం ఒక్కటే వుండాలి. ఇంకా చెప్పాలంటే ఒక్కటే గుళిక. అదే సర్వరోగ నివారిణి.