అప్పుడప్పుడూ అభిప్రాయాలతో కూడా పనిబడుతుంది- రాష్ట్రపతికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అభిప్రాయంతో పనిబడినట్లు
అంటే ప్రతి సభ్యుడూ అసెంబ్లీకి వెళ్ళినప్పుడు, సరిపడా చొక్కా తొడుక్కొని వెళ్ళినట్టు, ఓ అభిప్రాయం కూడా తొడుక్కుని వెళ్ళాల్సి వుంటుంది. ‘బ్రాండెడ్’ చొక్కాలయితే బెటర్ గా వుంటాయి. ఏదో ‘మాల్’కు ఇలా వెళ్ళి అలా తొడుక్కుని వచ్చేయవచ్చు. ఏవో రెండు మూడు సైజుల్లో చొక్కాలు దొరుకుతాయి. కానీ ఇలాంటి ‘బ్రాండెడ్’ చొక్కాలకు ఓషరతు వుంటుంది: చొక్కాలను బట్టి దేహాలను సర్దుబాటు చేసుకోవాలి కానీ, దేహాలను బట్టి అక్కడ చొక్కాలు కుట్టరు